నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని 1వ టౌన్ పరిధిలో సెల్ ఫోన్ షాప్ షట్టర్ లిఫ్టింగ్ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. పోలీసులు ప్రత్యేక పహారా, గట్టి పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. దర్యాప్తును వేగవంతం చేసి కామారెడ్డి జిల్లా తాడ్వాయికి చెందిన శ్రీకాంత్, బోండి తరుణ్ లు ప్రస్తుతం బాబాన్ సాహెబ్ పహాడ్ లో నివాసం ఉంటున్నారని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు ఎస్ హెచ్ వో తెలిపారు.
