Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 January 2025, 6:27 pm Posted by : ramakrishna

గౌతంనగర్ లో గొలుసు దొగతనం చేసిన ఇద్దరి అరెస్ట్

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని గౌతం నగర్ లో ఈ నెల 4న మహిళ మెడలోనుంచి గొలుసు దొంగతనం చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు మూడవ టౌన్ ఎస్ఐ  తెలిపారు.  స్థానికంగా గౌతం నగర్ కు చెందిన సాయి, కిర్తిరాజ్ లపై పాత కేసులు ఉన్నాయి. గతంలో చోరీలు చేసిన అనుభవంతో మహిళ మెడలోనుంచి సాయి గొలుసు దొంగతనం చేశాడని, అతడికి కిర్తిరాజ్ సహకరించాడని ఎస్ఐ తెలిపారు. ఇద్దరిని సాంకేతిక సహాయంతో పట్టుకుని అరెస్టు చేసి గురువారం రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.