జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్టు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జల్సాలకు అలవాటు పడి బైక్ లను చోరీలు చేసి అమ్ముకుని తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు ఘరానా బైక్ దొంగలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఐదవ టౌన్ పోలిస్ స్టేషన్ పరిధిలోని బాబన్ సహబ్ పహడ్ ప్రాంతంలో మంగళవారం వాహనాల తనిఖీలో నెంబర్ ప్లేట్ లేని బైక్ పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తుండగా పట్టుకోవడంతో ఘరానా బైక్ దొంగల గుట్టు రట్టైనట్టు ఏసీపీ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని రహ్మత్ పురకు...