Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2025, 6:52 pm Posted by : ramakrishna

మద్యం షాపులకు రెండు దరఖాస్తులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల నిర్వహణ (లైసెన్స్)లకు రెండు దరఖాస్తులు వచ్చాయని నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాలు  ముహుర్తాలు ఉండటంతో తొలిసారి రెండు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. నందిపేట్ మండల కేంద్రంలో (30) జిఎస్ఎల్ నంబర్ వైన్స్ కు కోరిపల్లి రజిత, సిరికొండ మండలం మైలారం (జి ఎస్ఎల్ నెంబర్ 91) కు జీ శ్రీనివాస్ రావులు దరాఖాస్తు చేశారని తెలిపారు. జిల్లాలో 102 మద్యం దుకాణాలకు ఈ నెల 26 నుంచి దరాఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.