హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
మద్నూర్, బతుకమ్మ: సిర్పూర్ గ్రామస్థులపై దాడి చేసిన ఇసుక మాఫియాకు చెందిన ఇద్దరు మహారాష్ట్ర వాసులను అరెస్టు చేసినట్లు బిచ్కుంద సీఐ రవి కుమార్ తెలిపారు. శనివారం బిచ్కుంద సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ.....ఈనెల 10న రాత్రి సమయంలో కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్పూర్ గ్రామ శివారులో, మహారాష్ట్ర రాష్ట్ర నాందేడ్ జిల్లా దేగ్లూర్ తాలూకా తములూరు గ్రామానికి చెందిన పీరాజీ, జునేద్ వారి అనుచరులు అక్రమ ఇసుక రవాణా చేస్తుండగా, వారిని...