నీటమునిగి కవల పిల్లలు మృతి

కామారెడ్డి మండలం తిమ్మక్​పల్లి గ్రామంలో ఘటన కామారెడ్డి, బతుకమ్మ :   కుంటలో పడి నీటమునిగి ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి మండలం తిమ్మక్​పల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రాల పెద్ద నర్సింలు మంజుల దంపతులకు రామ్​, లక్ష్మణ్​ (13) అనే కవల పిల్లలు ఉన్నారు. గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ లో వారు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. స్కూలు అయిపోయిన అనంతరం ఈత కొట్టడానికి  గ్రామ శివారులోని ఒక కుంటలోకి వారు...