Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 7:27 pm Posted by : ramakrishna

రేపే టీవీయువీ అకాడమిక్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం

 

. . . టీవీయూవీ జిల్లా అధ్యక్షులు రాంపూర్ అజయ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక (టీవీయూవీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా “టీవీయూవీ అకాడమిక్ ఎక్స్లెన్స్ అవార్డ్స్” పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు రాంపూర్ అజయ్ తెలిపారు. విద్య, క్రీడలు, కళలు తదితర రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఎక్స్లెన్స్ అవార్డులతో సత్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పురస్కార ప్రదానోత్సవం ఆగస్టు 6వ తేదీన నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడం, వారి విజయాలను గుర్తించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అజయ్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.