మంచాన్ని కారులా మార్చేసి రోడ్డుపై చక్కర్లు

వెబ్ న్యూస్, బతుకమ్మ : మంచాన్ని కారులా మార్చేసి ఓ వ్యక్తి రోడ్డుపై చక్కర్లు కొడుతున్నాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ లో ఈవింత వాహనం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  శంభునగర్ కు చెందిన నవాబ్ అనే వ్యక్తి మంచాన్ని కారులా మార్చేసి రోడ్డుపై విహరిస్తున్నాడు. ఈదృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.