ఆన్ లైన్ ముద్దు… ఆఫ్ లైన్ వద్దు
. . . పసుపు విక్రయాలకు బహిరంగ వేలం విధానం పై మండిపాటు
. . . ఈ నామ్ సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయడం లేదని రైతులు ఆగ్రహం
. . . ఫర్నీచర్ ధ్వంసం… చైర్మన్ డౌన్ అంటూ నినాదాలు
నిజామాబాద్, బతుకమ్మ:
తెలంగాణలో పేరెన్నికగన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆన్ లైన్ లో జరిగే క్రయ విక్రయాల సాప్ట్ వేర్ ఈ నామ్ ని అప్డేట్ చేయడం లేదని రైతులు ఆగ్రహం తో ఊగిపోయారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్ లో గల ఎంఈసీ కార్యాలయాన్ని నిజామాబాద్. జగిత్యాల జిల్లా కు చెందిన పసుపు రైతులు ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి కొందరు రైతులు కుర్చీ లను విరగోట్టారు. పోలిసులు కొందరిని గేట్ వద్ద అడ్డుకోవడంతో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు..

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు విక్రయాలు జోరుగా జరిగే సీజన్ లో ఈ నామ్ సాప్ట్ వేర్ 1.0 కారణంగా ఆన్ లైన్ ట్రేడింగ్ జరుగక రైతులు నష్టపోతున్నారు. నెల రోజులుగా వ్యవసాయ మార్కెట్ అధికారులు సాప్ట్ వేర్ అప్డేట్ చేయించక 2.0 ద్వారా జరుగుతున్న క్రయ విక్రయాలు సాధరణ బహిరంగ వేలం పాట మాదిరిగా జరుగడంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. నెల రోజులుగా మార్కెట్ యార్డులో ఒక్కరిద్దరు వ్యాపారులు మాత్రమే వేలంలో పాల్గొని తమకు నచ్చిన ధరలు కోట్ చేయడం ద్వారా క్వింటాళ్లకు రైతులకు రూ.3 వేల నుంచి రూ 5 వేల నష్టం వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని పసుపు రైతులు ఆగ్రహంతో ఉన్నారు.

వ్యాపారులు సిండికేట్ కారణంగా రైతులు నష్టపోతున్న నెలరోజులుగా సాఫ్ట్ వేర్ అప్డేషన్ ను మరిచి వేలం పాట ద్వారా క్రయ విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తొమ్మిది నెలలు కష్టపడి పంట పండిస్తే దళారులు, అధికారులు కుమ్మక్కై రైతులను నట్టేట ముంచుతున్నారని అధికారుల తీరుపై మండిపడ్డారు. రైతుల నిరసన తెలిసి గేట్ వద్ధకు వచ్చిన ఏఎంసీ సహయ కార్యదర్శి ని రైతులు నిలదిశారు. ఈ సంధర్బంగా ఈ నామ్ అధికారులతో పోన్ లో మాట్లాడేందుకు యత్నించిన విఫలమయ్యారు. ఈనామ్ సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసి పునరుద్ధరించాలని రైతులకు మద్దతు ధర కల్పించే వరకు ఆందోళన చేస్తామని రైతులు హెచ్చారించారు. పోలిసులు భారీ బందోబస్తు ఎర్పాటు చేశారు.
