పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్
. . . పర్చువల్ గా కేంద్రమంత్రితో కలిసి ప్రారంభించిన ఎంపి అర్వింద్
. . . నిజామాబాద్ లో పాల్గోన్న చైర్మెన్ ఎమ్మెల్యేలు రైతులు
నిజామాబాద్ , బతుకమ్మ:
జాతీయ పసుపు బోర్డును ఢిల్లీ నుంచి వర్చువల్ గాకేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ధర్మపురి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పనిచేయనున్న పసుపు బోర్డు ను ప్రైవేట్ హోటల్ లో ఎర్పాటు చేసిన వేదికగా మంగళవారం ప్రారంభించారు.నిజామాబాద్ లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నిజామాబాద్ ఆర్మూర్ ఎమ్మెల్యేలు దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా రాకేష్ రెడ్డి, స్పైసెస్ బోర్డు నేషనల్ సెక్రటరీ రమశ్రీ సుబ్రహ్మణ్యం లు రైతులు పాల్గోన్నారు.

మోడీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు
ఈ సంధర్బంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్ మాట్లాడుతు… ప్రధాని మోడి అశీస్సుల కారణంగానే పసుపు బోర్డు నిజామాబాద్ లో ఎర్పాటు చేశాం.పసుపు రైతులకు అలాగే తొలి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి అభినందనలుప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు ఇతర అనేక ఉత్పత్తులు గతంలో ఎక్కువగా ఎగుమతి అయ్యేవి కాదు..ప్రధాని మోడీ కృషితో ఆ పరిస్థితి మారింది .అనేక దేశాలు భారత్ ఉత్పత్తులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది..తెలంగాణ ఆంధ్రాలో నాణ్యమైన పసుపు పండిస్తారుఅందుకే నిజామాబాద్ లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది.నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చాలా ఉంది. పసుపు సాగు నాణ్యత మరింత పెంచాల్సిన అవసరం ఉంది.పసుపు ప్రాధాన్యం కరోనా సమయంలో అందరికీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ ఎగుమతి రవాణా అన్నింటిపై కేంద్రంఆధ్వర్యంలో పసుపు బోర్డు దృష్టి సారిస్తుంది. 40 రైతుల ఏళ్ల పసుపు బోర్డు కల నిజం చేశాం .నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు పని చేస్తుంది.దీని వల్ల పసుపు రైతుల అభివృద్ధికి మరింత ఊతమిస్తుంది. ఈరోజు నుంచే పసుపు బోర్డు పనిచేయడం ప్రారంభిస్తుంది . స్పైస్ బోర్డు నిధులను ప్రస్తుతం దీనికి ఉపయోగిస్తాం . వచ్చే బడ్జెట్లో పసుపు బోర్డుకు తగిన నిధులు ఇస్తాం .పసుపు బోర్డు కు తగ్గిన అధికారులు సిబ్బందిని కేటాయిస్థాం .రెండేళ్లలోపసుపు ఉత్పత్తి రెండింతలు చేస్తాం. పెద్ద ఎత్తున ఎగుమతులను ప్రోత్సహిస్తాము అన్నారు.

పసుపు రైతుల పక్షనా మోదికి ధన్యవాదాలు…. ఎంపి ధర్మపురి అర్వింద్
తెలంగాణలో పసుపు బోర్డు కోసం నాలుగు దశబ్ధాలుగా రైతులు పోరాటం చేస్తున్నారు. రైతుల శ్రేయస్సు కోసం పసుపు బోర్డును నిజామాబాద్ లో ఎర్పాటు చేసిన ప్రధాని మోడికి కేంద్రమంత్రులకు ధన్యవాదాలు. మోడి నిజామాబాద్ రైతులకు ఇచ్చిన మాటకు కట్టు బడి పసుపు బోర్డు ఎర్పాటు చేయడం పసుపు పండించే రైతులకు మెలుకలుగుతుంది.
