- ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్, బతుకమ్మ: బాల్కొండ నియోజకవర్గంలో వివాహాలు జరిగి కొత్తగా మంజూరు కావాల్సిన వేల్పూర్(87), భీంగల్ (104), ఏర్గట్ల(32) కళ్యాణ లక్ష్మి మండలాల కు చెందిన మొత్తం 223 కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ దరఖాస్తు లపై మంజూరు చేస్తూ బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం తులం బంగారం పథకాన్ని వెంటనే ప్రారంభించాలి. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్ తో పాటు తులం బంగారం ఇవ్వాలన్నారు. కొత్తగా చెక్ లు మంజూరయ్యే లబ్దిదారులతో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్ లు అందుకున్న వారందరికీ తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.