| . . . ఏ ఒక్క ఎమ్మెల్యే సొంత గ్రామంలో అభివృద్ధి నిరూపిస్తే ముక్కు నేలకు రాసుకుంటా
. . . ఆర్మూర్ లో 13 నెలల్లోనే రాకేష్ రెడ్డి పని ఖత మైంది
. . . బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలను వంచించడం, మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం గా మారిందన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజు నాలుగు పథకాలను ప్రారంభిస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ కు ప్రజలు నిలదీయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ స్వగ్రామంలోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఒక్కటైనా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రజలచే నిరూపిస్తే ముక్కు నేలకు రాసుకొని, రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవుళ్ళ మీద ఒట్లు కనిపించే వారి పైన తిట్లు తప్ప ఏది చేతకాదని జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలు అట్టర్ ఫ్లాప్ కావడంతో కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకున్నారని ఆయన అన్నారు. అందరికీ ప్రభుత్వ పథకాలు ఇస్తామని చెప్పి తప్పించుకున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ శంకర్, సత్యపాల్, మహిళా నాయకురాలు ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

|