అల్లూరి సీతారామరాజుకు టీయూసీఐ విప్లవ నివాళి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మన్యం వీరుడు, స్వాతంత్ర్యోద్యమ గెరిల్లా పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి  పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మట్టి లాంటి మనుషులను మర ఫిరంగులుగా చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాధాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అటవీ...