టీయూసీఐ రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి
నిజామాబాద్, బతుకమ్మ : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(TUCI) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాలను ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో నాయకులు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ మనదేశంలో కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించి వేస్తుందన్నారు. 8 గంటల పని విధానం రద్దుచేసి, 12 గంటల పని విధానం తీసుకొచ్చే కుట్రలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ...