టీయూసీఐ ఆహ్వాన సంఘం కరపత్రాల ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం కరపత్రాలను టీయుసీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి, శ్రామిక భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయుసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ వచ్చేనెల 21, 22 తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీయుసీఐ రాష్ట్ర మహాసభలు జరుగుతాయన్నారు. ఈ మహాసభలకు టీయుసీఐ జాతీయ నేతలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వివిధ జిల్లాల ప్రతినిధులు జిల్లాలోని కార్మికులు హాజరవుతారన్నారు. ఈ మహాసభల్లో కార్మిక హక్కులు,...