నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం కరపత్రాలను టీయుసీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి, శ్రామిక భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయుసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ వచ్చేనెల 21, 22 తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీయుసీఐ రాష్ట్ర మహాసభలు జరుగుతాయన్నారు. ఈ మహాసభలకు టీయుసీఐ జాతీయ నేతలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వివిధ జిల్లాల ప్రతినిధులు జిల్లాలోని కార్మికులు హాజరవుతారన్నారు. ఈ మహాసభల్లో కార్మిక హక్కులు, సమస్యలు, గత ఉద్యమాలను సమీక్షించుకొని, భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని కార్మికులు, ప్రజలు ప్రజాస్వామ్యవాదులు, వ్యాపార వర్గాలు ఆర్థిక హార్దిక సహకారం అందించి, మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్, జిల్లా నాయకులు సాయన్న, కిరణ్, విఠల్, రవి, మురళి తదితరులు పాల్గొన్నారు.