టీయూసీఐ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఎం.నరేందర్, ఎం.సుధాకర్.   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయుసీఐ) జిల్లా ప్రధమ మహాసభ జయప్రదంగా ముగిసింది. ఈ సందర్భంగా  టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ టీయుసీఐ జిల్లా మహాసభలో గత పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించుకున్నామన్నారు.  మహాసభలో పలు తీర్మానాలను చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు...