Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 June 2025, 4:18 pm Posted by : ramakrishna

టీయూసీఐ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

  • జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఎం.నరేందర్, ఎం.సుధాకర్.

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయుసీఐ) జిల్లా ప్రధమ మహాసభ జయప్రదంగా ముగిసింది. ఈ సందర్భంగా  టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ టీయుసీఐ జిల్లా మహాసభలో గత పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించుకున్నామన్నారు.  మహాసభలో పలు తీర్మానాలను చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. పని గంటల పెంపుదల నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో టీయూసీఐ నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు.

  • టీయూసీఐ జిల్లా నూతన కార్యవర్గం:

అధ్యక్షుడిగా ఎం.నరేందర్,  ప్రధాన కార్యదర్శిగా ఎం.సుధాకర్ ఉపాధ్యక్షులుగా ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్ సహాయ కార్యదర్శులుగా బి.మల్లేష్, డి.కిషన్ కోశాధికారిగా  పి.సాయన్న కార్యవర్గ సభ్యులుగా మురళి, లక్ష్మణ్, రాజేశ్వర్, కిరణ్, లక్ష్మి, రెహనా, ఫాతిమా, లింగం, రవి, గంగాధర్, మక్కన్న మరియు 07 కో ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కార్యవర్గంతో టీయూసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం ప్రతిజ్ఞ చేయించారు.

TUCI District New Committee Unanimously Elected