Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 February 2025, 4:10 pm Posted by : ramakrishna

సింగరేణి సిఎండిని కలిసిన టీయూ బంజారా విద్యార్థి నాయకులు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : సింగరేణి సిఎండి బలరాం నాయక్ ను తెలంగాణ విశ్వవిద్యాలయ బంజారా విద్యార్థి నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఈ నెల  21న తెలంగాణ యూనివర్సిటీ లో నిర్వహించే శ్రీ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్  జయంతి వేడుకలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రం   అందజేశారు. విశ్వవిద్యాలయంలో జరిగే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొంటానని విద్యార్థి నాయకులతో ఆయన తెలియజేశారు.