వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈలేఖలపై ఆదివారం, సోమవారం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు తెలిపింది. ప్రజాప్రతినిధులకు సంబంధించి రోజుకు ఒక లేఖ మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేసింది. ఈఆదేశాలను మార్చి 24 నుంచి అమలు చేస్తామని టీటీడీ వెల్లడించింది. ఇటీవల పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈఅంశంపై మండిపడ్డ విషయం తెలిసిందే.