Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 December 2024, 7:20 pm Posted by : ramakrishna

టి ఎస్ ఆర్ బంక్వెట్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ గ్రామం లోకి వెళ్లే బైపాస్ రోడ్డు ప్రక్కనే గల జాతీయ రహదారి పక్కనే నిర్మించిన టిఎస్ఆర్. బంకెట్ హల్ ఏ.సీ.ని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన ఈ హాల్ ను వేద పండితులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఈ హాల్ నిర్మించడం పట్ల పలు వివాహది వేడుకలు, ఇతరత్రా ఫంక్షన్లు చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిర్మించడం జరిగిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా జాతీయ రహదారి పక్కనే గ్రామ సమీపంలో నిర్మించడం వల్ల ఫంక్షన్ చేసే వారికి సైతంఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, వాహనాలు పార్కింగ్ సైతం ఏర్పాటు చేసి,  ఫంక్షన్లు నిర్వహించుకునే వారికి అన్ని వసతులు కల్పించి నిర్మించడం జరిగిందని ఆయన యజమానులను ఉద్దేశించి ఆయన కొనియాడారు. కార్యక్రమంలో టి.ఎస్.ఆర్. బంకేట్ ఫంక్షన్ హాల్ యజమాని కుటుంబ సభ్యులు, బంధువులు, మండల బి. ఆర్. ఎస్.నాయకులు,తాజా మాజీ ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

TSR Banquet Hall was inaugurated by MLA