Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 2:29 pm Posted by : ramakrishna

ట్రంప్ దిష్టిబొమ్మ దహనం 

నిజామాబాద్, బతుకమ్మ :  వెనిజులాపై అమెరికా దాడికి నిరసనగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాయకులు ట్రంప్ దిష్టిబొమ్మ దహనం  చేశారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి  ఏ రమేష్ బాబు మాట్లాడారు. వెనుజులాపై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడు మదురో, అతని భార్యను అక్రమంగా న్యూయార్కు తరలించడాన్ని ఖండించారు. ఇందుకు వ్యతిరేకంగా  ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు.  ఆ దేశంలోని వివిధ పట్టణాల్లో బాంబుదాడులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని ఆయన విమర్శించారు. అదేవిధంగా  ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వైఖరిని ఖండించి వెనుజులకు అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో  సీపీఎం  జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్ జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర కమిటీ సభ్యులు నల్వాల నరసయ్య, అనసూయ, మరియు నగర నాయకులు అంజయ్య, శంషుద్దీన్, అబ్దుల్, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.