Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 January 2025, 7:58 pm Posted by : ramakrishna

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టిఆర్టియూ వినతిపత్రం

నందిపేట్ బతుకమ్మ: కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 నుండి అమలు చేయనున్న యు పి ఎస్ (ఏకీకృత పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి, రాష్ట్ర ప్రభుత్వం సి పి ఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని కోరుతూ నందిపేట్ మండల టి ఆర్ టి యూ శాఖ తరఫున సోమవారం మండల తహసీల్దార్ ఆనంద్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టి ఆర్ టి యూ నాయకులు మాట్లాడుతూ, సి పి ఎస్ విధానం ఉద్యోగులకు నష్టదాయకమని, పాత పెన్షన్ విధానమే ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా కల్పిస్తుందని వివరించారు. వారు యు పి ఎస్ విధానంపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ టి యూ జిల్లా కార్యదర్శి G. కిషన్, మండల అధ్యక్షుడు భూషన్, కార్యదర్శి రమేష్, ఇతర శాఖల సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.