- కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : టీఆర్ఎస్ అబద్దపు ప్రచారాలను తిప్పి కొట్టాలని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని 9వ డివిజన్ ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శోభన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రజా పాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరేలా ప్రచారం చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మీద అనవసరంగా బిజెపి, టిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వ డివిజన్ ఇంచార్జమాట్లాడుతూ శోభన్ మాట్లాడుతూ రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తన డివిజన్ ప్రజలకు అందేలా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నరాల రత్నాకర్, కేశ వేణు, రాంభూపాల్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
