. . . సెక్రెటరీయేట్ ముందు వడ్లు పోసి నిరసన
. . . కవితతో పాటు పలువురు అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్, బతుకమ్మ:
రైతుల గోస పట్టని సర్కారుకు బుద్ధి రావాలని తెలంగాణ రక్షణ సేన సెక్రటేరియట్ ముందు నిరసన కు దిగింది. శుక్రవారం టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ సచివాలయం ఎదుట వడ్లు పోసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..

ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేసి వారికి బాసటగా నిలవాలని సోయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అన్నారు. మండుతున్న ఎండలతో వడదెబ్బకు గురై కల్లాల్లోనే ఊపిరి వదులుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు . అకాల వర్షాలతో తడిసిన ధాన్యం, మక్కలు, పొద్దుతిరుగుడు పువ్వు, జొన్నలను ఆరబెడుతూ కాంటా వేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు అని తెలిపారు.తూకం లో తరుగు తీస్తున్నారు. తేమ పేరిట కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని బి గ్రేడ్ గా చెప్తూ రైతులను మిల్లర్లు మోసం చేస్తున్న పట్టించుకునే నాథుడు లేడు అని పేర్కొన్నారు.రెండున్నరేళ్లుగా వ్యవసాయ శాఖను సమీక్షించని సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకుని ప్రత్యక్షంగా కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులకు భరోసా కల్పించాలి.

పండిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తున్నది అన్నారు. ఇవాళ సెక్రటేరియట్ ముందు వడ్లు పోసి నిరసన తెలిపాం. ఇది శాంపిల్ మాత్రమే… వానలు పడే లోపే కొనుగోళ్లను పూర్తి చేయకపోతే… తెలంగాణ రక్షణ సేన రంగంలోకి దిగుతుంది. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణలో తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాము అన్నారు. ఈ సందర్భంగా నిరసన తెలిపిన కవితతో పాటు తెలంగాణ రక్షణ సేన నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.