నీలకంఠేశ్వర ఆలయంలో టీఆర్ఎస్ చీఫ్ కవిత ప్రత్యేక పూజలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ లో గల శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకొని అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. గురువారం తెల్లవారుజామున( కార్తీక పౌర్ణమి మరుసటి రోజు) నీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం మా కుటుంబ ఆనవాయితీ అని కవిత తెలిపారు.నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో పూజారులు కవితకు స్వాగతం పలికి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోమరిన్ని అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని అర్చకులు...