Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 12:37 pm Posted by : ramakrishna

భూ నిర్వాసితుల తో గవర్నర్ ను కలిసిన టీఆర్ఎస్ చీఫ్ కవిత

 

 హైదరాబాద్, బతుకమ్మ:

వెలుగుమట్ల, కడ్లాపూర్, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసిత బాధితులతో  తెరాస చీఫ్ కల్వకుంట్ల కవిత  గవర్నర్  శివ ప్రతాప్ శుక్ల ను కలిసారు. మంగళవారం ఉదయం లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ని భూనిర్వాసితుల తో కలిసి వినతి పత్రం అందచేశారు.  ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన బాధితులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని, పరిగి మండలం కడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు జారీ చేసిన భూసేకరణ నోటీసులను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు.  ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పు ,భూసేకరణ సమస్యలపై బాధితులతో కలిసి వినతిపత్రం అందజేశమని పేర్కొన్నారు.

TRS Chief Kavitha meets Governor with displaced people