Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 8:52 pm Posted by : ramakrishna

త్రివిధ దళాల సైనికుల గౌరవర్థం తిరంగ ర్యాలీ

  • మనం సైతం మన దేశం కోసం
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి

 

భీమ్ గల్, బతుకమ్మ : కాశ్మీర్ లోని పెహల్ గామ్ దాడిలో 27 మంది యాత్రికులను దారుణంగా చంపిన పాకిస్తాన్  ఉగ్రవాదమును తుదముట్టించేందుకు భారత త్రివిధ దళాల సైనికులు చేసిన వీరచిత పోరాటానికి గుర్తుగా, సైనికుల గౌరవర్థం ఈ తిరంగ ర్యాలీని నిర్వహించడం జరిగిందని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి అన్నారు.మండల బీజేపీ ఆధ్వర్యంలోమండల కేంద్రంలో శనివారం నిర్వహించిన తిరంగ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర సర్కార్ ఉగ్రమూకాలను తుదముట్టించాడానికి  చేపట్టిన ఆపరేషన్ కు ఆడబిడ్డల పసుపు కుంకుమలను కాపాడడానికని ప్రధాని సింధూర్ ఆపరేషన్ అని పేరు పెట్టారని అన్నారు. భారత సైన్యం వీరోచితంగా పోరాడి ఆపరేషన్ సింధుర్ విజయవంతం చేసి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను తుద ముట్టించి సాహసోపేత ఆపరేషన్ నిర్వహించినందుకు సైనికులకు ఆయన ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.సైనికులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛానిచ్చినటువంటి భారత సర్కార్ కు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ధన్యవాదాలు తెలియజేశారు ఇలాంటి తిరంగా యాత్ర ర్యాలీలు నిర్వహించడం ప్రతి భారతీయుని హక్కని ఇలాంటి కార్యక్రమాలు భారతీయులుగా అందరం రాజకీయాలకతీతంగా,కులాల కతీతంగా,మతాలకతీతంగా చేసుకుంటూ భారత సర్కార్ కు, భారత సైన్యానికి మద్దతుగా  నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ జెండాలను పట్టుకొని మండల కేంద్రంలోని అన్ని ప్రధాన వీధుల గుండా భారత్ మాతాకీ జై, జై జవాన్, జై కిసాన్ అంటూ  నినాదాలు చేసుకొంటూ తిరంగ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఆరే రవీందర్, నియోజకవర్గ కన్వీనర్ మోహన్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ కనికరం మధు,జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్,బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల బిజెపి పార్టీ ప్రెసిడెంట్లు,పాధాధికారులు,భీమ్ గల్ మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.