భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులు

బతుకమ్మ, కమ్మర్పల్లి: భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కమ్మర్పల్లి మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్, మధు నగర్ ప్రభుత్వ పాఠశాలలో, మోర్తాడ్ మండల కేంద్రంలో, గాండ్లపేట్, డోన్కల్, ధర్మోరా తదితర గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.