Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2025, 2:04 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ ఓబీసీ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి కి నివాళ్లు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు, ఆర్ టి వో మెంబర్ డి. రాజా నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి 16వ వర్థంతి సందర్భంగా నగరంలోని వినాయక నగర్ లోని అమరవీరుల పార్క్ హనుమాన్ జంక్షన్ వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ యావత్తు ప్రపంచానికి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆవశ్యకతను తన ఆత్మ బలిదానం ద్వారా తెలియజేసిన త్యాగమూర్తి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి అని కొనియాడారు. అమరుల త్యాగాల మీద రాజ్యమేలి తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకున్న దుర్మార్గ పాలకున్ని ప్రజలు ఓడించినరోజు ఒకటే కావడం గమనించదగిన విషయమన్నారు.అమరవీరులందరి ఆశయాలు నెరవేర్చే ప్రజాపాలన కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిన రోజు ఒకటే కావడం విశేషమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 3న తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినంగా ప్రకటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘాలు నాయకులు పాల్గొన్నారు.