Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 9:04 pm Posted by : ramakrishna

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కి ఘన నివాళులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

పేద ప్రజల అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని నేషనల్ హ్యూమన్ రైట్స్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు తేలు సరిత అన్నారు. మంగళవారం అంబేద్కర్ 135 వ జయంతి ని పురస్కరించుకుని నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు తేలు సరిత, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బానోత్ గోపాల్ నాయక్, జిల్లా సంయుక్త కార్యదర్శి భానోత్ లక్ష్మణ్ నాయక్, రూరల్ నియోజకవర్గం అధ్యక్షులు బానోత్ శ్రీరామ్ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు ఆలవాల బుచ్చమ్మ, జిల్లా కమిటీ సభ్యులము తదితరులు పాల్గొన్నారు.