దొడ్డి కొమురయ్యకు ఘన నివాళులు
బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు తెలంగాణ తొలి అమరుడు, రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. రజాకారుల అణచివేతకు వ్యతిరేకంగా, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహోన్నత యోధుడు దొడ్డి కొమురయ్య సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ మండల కురుమ సంఘం అధ్యక్షుడు మేడి రవి, సాలూరు మండల బీజేపీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ రావు బాగంగాధర్, సొసైటీ...