Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2025, 4:31 pm Posted by : ramakrishna

కామ్రేడ్ ముఖ్తార్ పాష, పైల చంద్రక్కలకు ఘన నివాళులు

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు కామ్రేడ్ ముఖ్తార్ పాష, కామ్రేడ్ పైల చంద్రక్క ల 5 వ వర్థంతి సందర్బంగా పూలాంగ్ దేవి టాకిస్ చౌరస్తా లోని ఐఎఫ్టీయూ కార్యలయంలో వారి చిత్ర పటాలకు పూల దండ వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నిజామాబాదు జిల్లా సహయ కార్యదర్శి పుట్ట వరదయ్య మాట్లాడుతు కామ్రేడ్ ముఖ్తార్ పాషన్న, పైల చంద్రక్క లు పీడిత ప్రజల కోసం తమ జీవితాంతం పోరాడారని ఆయన అన్నారు. ప్రతిఘటన పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి నమ్మి సిద్దాంతాన్ని ఆచరించినవారని ఆయన కోనియాడారు. నేటి తరానికి పాష, చంద్రక్క ల పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం అన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం పాషన్న జీవితాంతం పోరాడాడని తెలిపారు. శ్రీకాకుళం గిరిజన పోరాటం లో పైల చంద్రక్క కీలక పాత్ర పోషించిందన్నారు. అమరవీరుల త్యాగాల బాటలో ప్రజలు, విప్లవ శ్రేణులు నడవాలని పిలువు ఇచ్చారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఏఐకేఎం ఎస్ జిల్లా కార్యదర్శి  దుడ్డు గంగాధర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సతీష్, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్, లక్ష్మణ్ గౌడ్, మందమల్లేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.