Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 December 2024, 11:05 am Posted by : ramakrishna

బోదన్ లో బాబా సాహేబ్ కు ఘన నివాళులు

బోదన్, బతుకమ్మ:

బోధన్ పట్టణంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతిని అధికారులు, అంబేద్కర్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు… అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి అంబెడ్కర్ అమర్ హై అంటూ నినదించారు.అంబేద్కర్ కూడలిలో  శుక్రవారం ఉదయం పంచశీల ను ఆలపించారు..బోధన్ తహసీల్దార్ విట్ఠల్ మాట్లాడుతూ భారతరాజ్యాంగన్ని రచించి గొప్ప ఖ్యాతి ని సంపాదించిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు నెరవేర్చలని కోరారు..ఈ సందర్బంగా పట్టణ సిఐ వెంకట నారాయణ, రిటెర్డ్ ఎం ఈ ఓ శంకర్, మాలమహనడు జిల్లా ప్రధాన కార్యదర్శి నీరడి రవి,మోచి శంకర్,సంజీవ్ తదితరులు  అంబేద్కర్  విగ్రహం వద్ధ శ్రద్ధంజలిఘటించారు.

Tributes to Baba Saheb in Bodan