Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2025, 7:47 pm Posted by : ramakrishna

పహల్గామ్ అమరులకు కోవ్వోత్తుల తో ఘన నివాళులు

వందేమాతరం.. .. . . హిందూస్తాన్ జిందాబాద్

. . . పాకిస్తాన్ ముర్దాబాద్ అంటు నినాధాలు

. . . నగరంలో క్యాండిల్ ర్యాలీ

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ బై సీన్ వ్యాలీలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళ్లు అర్పించారు. నగరంలోని గాంధీ చౌక్ నుంచి భగత్ సింగ్ చౌరస్తా వరకు బుధవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు దినేష్ కులాచారీ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, నాయకులు ఎడ్ల బాలక్రిష్ణ తో పాటు నగర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతు….జమ్మూ కాశ్మీర్ లో జరిగిన మారణకాండ కు కారకులైన ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టమని ప్రతి చర్య ఉంటుంది అని అన్నారు. భారత ప్రభుత్వం వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు అన్నారు. మతం ఆధారంగా మతాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేశారని అన్నారు. మతాన్ని లక్ష్యం చేసుకుని ఇలాంటి దృశ్చర్య కు పాల్పడ్డారో యావత్ దేశం మొత్తం ఖండించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఈ సంఘటనని అన్ని మతాలవారు ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఉగ్రవాదానికి మతం రంగు లేదని చాలామంది అన్నారు కానీ మతం ఆధారంగానే దాడులు జరుగుతున్నాయని ఈరోజు స్పష్టమైనది. ఈ దృశ్చర్యకు వెనకాల ఎవరు ఉన్నా ఏ దేశం ఉన్న భారతదేశం మాత్రం వదిలిపెట్టదని అన్నారు. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాము అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో  దేశ ప్రజల పై జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే అంటూ నినాదాలు చేశారు.

 

Tributes paid to the martyrs of Pahalgam with wreaths