బతుకమ్మ, కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలో సోమవారం ఉమ్మడి మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు కిష్టయ్య చిత్రపటం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.మలిదశ తెలంగాణ ఉద్యమంలో వీర మరణం పొందిన కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలు వెలకట్టలేని వని అన్నారు. అటువంటి మహానీయుల త్యాగాలకు అనుగుణంగా ఇప్పటి ప్రభుత్వాలు ముదిరాజులను బీసీ డీ నుండి బీసీ ఏ లోకి చేర్చాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజులందరూ ఐకమత్యంగా ఉండి మంచి నాయకున్ని ఎన్నుకొని కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి,జయంతి వేడుకలు నిర్వహించుకోవడానికి స్థలాన్ని సేకరించుకుని ఆ మహనీయుని విగ్రహ ప్రతిష్టాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నీరడి గంగాధర్, మండల మహిళా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు స్వరూప గంగాధర్,కోటగిరి మండల ముదిరాజ్ సంఘం ఇంచార్జ్ అధ్యక్షులు కోటగిరి సుదర్శన్,నిజామాబాద్ జిల్లా యూత్ అధ్యక్షులు కప్ప గణేష్,వర్ని,కోటగిరి,రుద్రూర్ మండలాల ముదిరాజ్ సంఘం ఇంచార్జ్ డా.సాయిలు,ముదిరాజ్ సంఘం ఆయా గ్రామాల అధ్యక్షులు,నాయకులు సభ్యులు పాల్గొన్నారు.