నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం లో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు ను సారంగాపూర్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయ బి.ఈడి కళాశాల అధ్యాపక బృందం కళాశాల ప్రిన్సిపాల్ తో కలిసి గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిఈడి కళాశాలలోని విద్యార్థుల హాజరు శాతం గురించి, ప్రస్తుతం నడుస్తున్న కార్యక్రమం గురించి వీసీ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బిఈడి విద్యార్థుల ప్రీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నడుస్తున్నందున త్వరలోనే సారంగాపూర్ ఎడ్యుకేషన్ క్యాంపస్ ను తప్పక సందర్శిస్తారని హామీ ఇచ్చారు. అందరూ కలిసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. సాయిలు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వన్నెల్ దాస్ శ్రీనివాస్ , సీనియర్ ఆధ్యాపకుడు డాక్టర్ఆర్. కర్ణాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎస్. రవీందర్, సువర్చల, పోలపల్లి శ్రీకాంత్,హరిత, గణేష్ తదితరులు పాల్గొన్నారు.