Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 9:02 pm Posted by : ramakrishna

నూతన కాంగ్రెస్ అధ్యక్షునికి సన్మానం

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శివన్నోళ్ల శివకుమార్ ని, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ సభ్యులుగా నియమించబడ్డ ఉప్పులుర్ గ్రామ వాస్తవ్యులు బాస వేణుగోపాల్ యాదవ్ ని గురువారం నాగేంద్ర నగర్ గ్రామానికి చెందిన యూత్ సభ్యులు పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర నగర్ ఉపసర్పంచ్ షేక్ జాకీర్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ఎర్రాజీ హరీష్, మస్జీద్ మైనారిటీ కమిటీ అధ్యక్షుడు షారూఖ్, భార్గవ్, షకీల్, నహీద్, దినేష్, సంజయ్, సన్నీ, సాగర్, సంతోష్, గంగప్రసాద్, మైనొద్దిన్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

 

Tribute to the new Congress President