తెలంగాణ గెజిటెడ్ఆఫీసర్స్ అధ్యక్షుడికి  సన్మానం

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నూతనంగా ఎన్నుకున్న తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్్స అధ్యక్షుడు అలక కిషన్ ను అంగన్వాడి టీచర్లు   శనివారం సన్మానించారు.  రానున్న రోజుల్లో అంగన్వాడి టీచర్లకు మద్దతు ఇవ్వాలని  ఆయనను అంగన్వాడీ టీచర్లు కోరారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు అండగా ఉంటారని నూతన అధ్యక్షుడు అలక కిషన్ ఈ సందర్భంగా  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ప్రెసిడెంట్ అనురాధ, సుజాత, గౌతమి తదితరులు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.