Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2025, 10:28 pm Posted by : ramakrishna

సావిత్రిబాయి పూలే కు ఘన నివాళి

నిజామాబాద్, బతుకమ్మ : జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో  సావిత్రిబాయి పూలే కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఐటిఐ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని  తెలిపారు. ఆనాడే మహిళలలు చదువుకుంటే విజ్ఞానం పెరుగుతుందని పాఠశాలలు ప్రారంభించారని అన్నారు. ఎన్ని అడ్డంకులు, అవమానాలు వచ్చిన ఎదుర్కొని నిమ్న జాతి కోసం కుల మతాలకతీతంగా కృషి చేసిన సామాజిక ఉద్యమ నాయకురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. వారి ఆశయ సాధన కోసం బీసీ సంఘాలన్నీ సమిష్టిగా ఏకం కావాలని సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలనిఅన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్, నర్సింలు, శేఖర్, ప్రవీణ్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.