ఎల్లారెడ్డి, బతుకమ్మ : అక్టోబర్ 21 అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలోని కోర్టు దగ్గర నుండి గాంధీ చౌక్ వరకు ఎల్లారెడ్డి సీఐ, ఎల్లారెడ్డి ఎస్ఐ, పోలీస్ సిబ్బంది సోమవారం భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నందు మండల ప్రజలు, ఔత్సాహికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అమరవీరుల త్యాగాలను నినాదాలుగా చేస్తూ, స్మరించుకుంటూ ఈ ర్యాలీ కొనసాగింది.
