Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 7:18 pm Posted by : ramakrishna

మున్సిపల్ రిటైర్డ్ డిఈ శివానందంకు సన్మానం

బోధన్, బతుకమ్మ : బోధన్ రైస్ భవన్ లో మున్సిపల్ రిటైర్డ్ డిఈ శివానందం 35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగరీత్యా అనేక సేవలైందించి పదవి విరమణ పొందిన సందర్భంగా బోధన్ శ్రీసాయి నాయి బ్రహ్మణ అజంగంజ్ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దాము ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు ఆయన మున్సిపల్ ఏ ఈ మరియు డిఈ గా అందించిన సేవలను కొనియాడారు….బోధన్ పట్టణంలో ముఖ్యంగా స్మశానవాటిక నిర్మాణం కోసం అహర్నిశలు లింగంపల్లి శివానందం అందించిన ప్రోత్సాహన్ని ఎన్నటికి మార్చొపోలేమని నాయి బ్రహ్మణులు సంఘనాయకులు గుర్తుచేశారు…రిటైర్డ్ డి ఈ శివానందం మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కులస్తుల్లో మార్పు రావాలి మీ పిల్లలను ఉన్నత చదువులకు బాటలు వెయ్యలాన్నారు, మంగలి వృత్తి మనకు జీవనఆధారం మాత్రమెనని సూచించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు లింగంపల్లి రమేష్,అధ్యక్షులు శంకర్,సెక్రటరీ జహంగీర్,ఉపాధ్యక్షులు ఆంజనేయులు,ముఖ్య సలహాదారులు వట్నల్ వార్ సాయిలు,యోగి,బాలు,గంధపు రమేష్,సంజీవ్,నంద కిషోర్,రాజు,మహిళలు  పాల్గొన్నారు.