Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2024, 1:53 pm Posted by : ramakrishna

లక్ష్మణ్ బాపూజీకి ఘననివాళి

కామారెడ్డి, బతుకమ్మ: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని కామారెడ్డి బస్టాండ్  సమీపంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రంగనాథ్ రావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ సుజాత, వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.