Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2025, 4:24 pm Posted by : ramakrishna

టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో కృపాల్ సింగ్‌కు సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల పదవీ విరమణ పొందిన జీయూపీఎప్ బర్కత్‌పుర హెచ్ఎం సోడి కృపాల్ సింగ్‌ను టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్  ప్రతినిధులు మాట్లాడుతూ, కష్టకాలాల్లో ఉన్న ఉపాధ్యాయులకు కృపాల్ సింగ్ ఆపద్బాంధవుడిగా, స్వచ్ఛంద సేవకుడిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ ప్రతినిధులు సల్లా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అరవింద్, రూరల్ ఎంఈఓ శెవ్లా, మోపాల్ ఎంఈఓ జెమ్ సింగ్, జవీద్, అస్రార్ నాయకులు పాల్గొన్నారు.