Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2025, 6:20 pm Posted by : ramakrishna

స్వాతంత్య్ర అమరవీరులకు ఘన నివాళులు

  •  ఐడీఓసీలో సంస్మరణ దినోత్సవం

నిజామాబాద్, బతుకమ్మ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే సంకల్పాన్ని చాటుతూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tribute to freedom martyrs