మాజీ ఎంపీ డా.మంద జగన్నాథానికి నివాళి
నిజామాబాద్, బతుకమ్మ: ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ డా. మంద జగన్నాథానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని ఓల్డ్ అంబేద్కర్ భవన్ లో సోమవారం నిర్వహంచారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు మాట్లాడారు. మాజీ ఎంపీ డా.మంద జగన్నాథంను కోల్పోవడం మాదిగ జాతికి తీరని లోటు అని అన్నారు. మాదిగల హక్కుల కోసం నిత్యం పోరాడిన నాయకుడు మంద జగన్నాథం అని తెలిపారు. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి, మంద కృష్ణ మాదిగకు అన్ని రకాలుగా అండగా ఉన్న నాయకుడని...