మున్నూరు కాపు ప్రభుత్వ, విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డీఎస్ కు నివాళి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ కు నగరంలోని డిఎస్ చౌరస్తాలో తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ, విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట రాజశేఖర్, గౌరవ అధ్యక్షులు బుస ఆంజనేయులు, ముఖ్య సలహాదారు ఆకుల ప్రసాద్, సలహాదారుడు చిట్టి నారాయణరెడ్డి , ఆదర్శ సంఘం అధ్యక్షుడు కానాపురం గంగాధర్, పోలీస్ నరసయ్య, హనుమాన్ సంఘం అధ్యక్షుడు రామచందర్, పుష్పాల రవి తదితరులు పాల్గొన్నారు.