జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు సన్మానం

బతుకమ్మ, భిక్కనూరు : జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నివాసంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి  మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో 90 శాతానికి పైగా సీట్లు సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, మాజీ ఎంపీపీ రేఖ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.