బతుకమ్మ, వేల్పూర్ : మండలం లోని పడగల్ గ్రామంలో నూతనంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడుగ ఎన్నికైన పోల విట్టలు గుప్త ని గురువారం వేల్పూరు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ఆర్యవైశ్య సోదరులు అన్ని రంగాలలో ముందు ఉండేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పోల సుధాకర్, వేల్పూరు మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు లాబీశెట్టి భానుచందర్, ప్రధాన కార్యదర్శి చిటిమల రాజ్ కుమార్, క్యాషియర్ వుత్తూరు దరి,సతీష్ ,రాజు,శ్రీనివాస్,బొంపెల్లి గంగాధర్,ప్రతాప్, రాజయ్య,జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.