అంబేద్కర్ కు ఘన నివాళి

వేల్పూర్, బతుకమ్మ: మండలంలోని పడగల్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక న్యాయ పోరాట యోధుడిగా, హక్కుల పరిరక్షకుడిగా దళితుల అభివృద్ధికి అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని కొనియాడారు.